calender_icon.png 23 September, 2024 | 1:40 PM

చైల్డ్ పోర్నోగ్రఫీపై మద్రాస్ హైకోర్టు తీర్పును తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

23-09-2024 11:34:09 AM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): చైల్డ్ పోర్నోగ్రఫీపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. చైల్డ్ పోర్నోగ్రఫీపై మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరం కాదని మద్రాస్ హైకోర్టు ఈ ఏడాది జనవరి 11న తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే మద్రాస్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీ ధర్మాసనంలో పిటిషన్ దాఖలైన్నాయి. చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోల నిల్వ పోక్సో, ఐటీ చట్టాల ప్రకారం నేరమన్న అత్యున్నత న్యాయస్థానం కోర్టులు ఆ పదాన్ని ఉపయోగించవద్దని ఆదేశించింది.