calender_icon.png 25 October, 2024 | 9:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెయిల్ వచ్చినా జైలులోనే కేజ్రీవాల్

12-07-2024 11:30:10 AM

న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ విచారణలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం కేజ్రీవాల్ పిటిషన్ ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. సీఎం బాధ్యతల నుంచి తప్పుకునే విషయంలో కోర్టు ఎలాంటి ఆదేశాలివ్వలేదని సుప్రీకోర్టు స్పష్టం చేసింది. అరెస్టు చేసినందున సీఎం పదవి నుంచి దిగిపోవాలా లేదా అనే నిర్ణయం ఆయనదేనని తేల్చిచెప్పింది. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధిగా.. సీఎంగా కేజ్రీవాల్ ఉన్నారని సుప్రీం కోర్టు తెలిపింది. మద్యం విధానం కేసులో ఏప్రిల్ 9న ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను కేజ్రీవాల్ సవాల్ చేశారు. మనీలాండరింగ్ కేసులో బెయిల్ వచ్చినా కేజ్రీవాల్ తీహర్ జైలులోనే ఉన్నారు.