calender_icon.png 4 March, 2025 | 9:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ కార్పొరేషన్ రుణాలను వెంటనే మంజూరు చేయాలి

04-03-2025 12:08:02 AM

జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు తోటమల్ల రమణమూర్తి

కొత్తగూడెం, మార్చి 3 (విజయక్రాంతి) : ఎస్సీ కార్పొరేషన్ రుణాలు మంజూరు చేయడంతోపాటు, కొత్త రుణాల కోసం షెడ్యూలు విడుదల చేయాలని జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు తోటమల్ల రమణమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. ఈ మేరకు జిల్లా కేంద్రమైన కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలో చుంచుపల్లి, నెహ్రు బస్తీ, బర్మా క్యాంప్, బాబు క్యాంప్, రామవరం, విద్యానగర్ కాలనీ లో సోమవారం విస్తృతంగా పర్యటించి పలువురు ప్రముఖులను కలుసుకొని సంఘం బలోపేతం పై చర్చించారు.

ఈ సందర్భంగా కొత్తగూడెంలో నియోజకవర్గ అధ్యక్షులు గుడివాడ రాము అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ మాల మహానాడు రాష్ర్ట అధ్యక్షులు సుధాకర్, జాతీయ కార్యదర్శి, జిల్లా ఇన్‌ఛార్జ్ భాస్కర్ ఆదేశాల మేరకు జిల్లాలో జాతీయ మాల మహానాడు ను బలోపేతం చేయడంతో పాటు, సంస్థాగత నిర్మాణాన్ని క్షేత్రస్థాయిలో పటిష్టం చేయడానికి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు సీనియర్ నాయకులు మోహన్, దేవయ్య, మాజీ ఎంపీటీసీ రాము, కృష్ణ , రాజేశ్వరరావు, పురుషోత్తం, శ్రీనివాసరావు, ఈశ్వరయ్య, మండల అధ్యక్షులు పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.