సంగారెడ్డి, నవంబర్ 24 (విజయక్రాంతి): లగచర్ల ఘటన విచారణ కోసం రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సోమవారం సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పర్యటిస్తారని అధికారులు తెలిపారు. ఉ. 11.30 లగచర్లకు చేరుకొని గ్రామస్తులను కలుస్తారని, సాయంత్రం 4 గం టలకు సంగారెడ్డి సెంట్రల్ జైలుకు వచ్చి బాధితులతో మాట్లాడుతారని పేర్కొన్నారు. ఈమేరకు ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.