24-02-2025 12:00:00 AM
జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు పిల్లి సుధాకర్
మెదక్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి) : దళితుల్ని రాజ్యాధికారానికి దూరం చేసేందుకు ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి భావజాలంతో నాగాపూర్ కేంద్రం నుండి వచ్చిన ఆదేశాలతోనే ముఖమంత్రి రేవంత్ రెడ్డి మాల మాదిగల్ని విడగొట్టే ఎస్సీ వర్గీకరణను అశాస్త్రీయంగా చేశారని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ అన్నారు. ఆదివారం నాడు మెదక్ పట్టణంలో జాతీయ మాల మహానాడు ఉమ్మడి జిల్లా సమావేశంలో అయన మాట్లాడుతూ... ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీ ఆమోదం పచ్చి మోసం అని అన్నారు. జస్టిస్ షమీమ్ అక్తర్ రిపోర్ట్ భయటపెట్టకుండా వర్గీకరణ చేయడం దారుణమని, ఎస్సీ వర్గీకరణ ఆగస్టు 1న వచ్చిన సుప్రీంకోర్ట్ మార్గ దర్శకాలకు విరుద్ధం అని అన్నారు.
కాంగ్రెస్‌కు ఓట్లు వేసిన మాలలను బొందపెట్టి బిజెపికి ఓటు వేయమన్న మందకృష్ణను అక్కున చేర్చుకున్న రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం మాలలు చేప్తారని అన్నారు. మాల సోదరులు ప్రత్యక్ష పోరాటులు సిద్ధంకావాలని పిలుపునిచ్చారు. మార్చిలో ఎస్సీ వర్గీకరణ చట్టం తెస్తామన్న ముఖ్యమంత్రి కిమాలలు తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఈ సమవేశంలో రాష్ట్ర నాయకులు మేడి అంజయ్య, రాజు, సత్యనారాయణ, ర్యాకం శ్రీరాములు, పురుషోత్తం, శివ, అశోక్ యాదగిరి శ్రీకాంత్ చంద్రయ్య సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు.