calender_icon.png 21 April, 2025 | 1:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ వర్గీకరణ విజయోత్సవాలను ఘనంగా నిర్వహించాలి

21-04-2025 12:00:00 AM

ఉక్కుల అశోక్

ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 20: ఎస్సీ వర్గీకరణ విజయోత్సవాలను ఘనంగా నిర్వహించాలని దళిత చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఉక్కుల అశోక్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఉత్సవాలను ప్రతి గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో మే 9వ తేదీన ఉదయం ఘనంగా నిర్వహించాలని ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధనకై అభినవ అంబేద్కర్, మహాజన నేత మందకృష్ణ మాదిగ గత 30సంవత్సరాలుగా నిరంతరం అలుపెరుగని పోరాటం చేసి నేడు ఎస్సీ వర్గీకరణ చట్టభద్దత సాధించారని ఈ వేడుకను డప్పులతో ప్రతి గ్రామ గ్రామ నా, మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో మే 9 వ తేదీన ఉదయం ఎస్సి వర్గీకరణ విజయసారధి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ చిత్ర పటానికి, పూల, పాలాభిషేకంతో గ్రామ, గ్రామాన ఘనంగా నిర్వహించాలని అన్నారు.

ఈ కార్యక్రమాని దళిత చైతన్య వేదిక (డీసీవీ ), ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ అనుబంధ సంఘాల నియోజకవర్గ ఇంచార్జ్ లు, మండల ఇంచార్జ్, నియోజకవర్గ, మండల, గ్రామ కేంద్రాల్లో ఎస్సీ  వర్గీకరణ విజయోత్సవాలు ఘనంగా నిర్వహించేలా భాద్యత తీసుకువాలని విజ్ఞప్తి చేశారు. ప్రతీ గ్రామంలో దళిత చైతన్య వేదిక (డీసీవీ ), ఎమ్‌ఆర్పిఎస్, జెండాలు, డప్పులతో అభినవ అంబేద్కర్, మహాజన నేత మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ చిత్ర పటానికి పూలలతో, పాలభిషేకలతో ఘనంగా నిర్వహించాలని అన్నారు.