నాగర్‌కర్నూల్, అక్టోబర్ 27(విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకట్‌స్వామి పేర్కొన్నారు. రాష్ట్రంలో 30 లక్షలకు పైగా జనాభా ఉన్న మాలలు ఇందిరాగాంధీ హయాం నుంచి కాంగ్రెస్ వైపు ఉన్నారని, మాలజాతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందన్నారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మాలల ఆత్మగౌరవ సభ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేంద్రపాల్‌తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై వక్తలు మాట్లాడారు. మాలలపై మనువాదులు అనే ముద్ర వేయాలనే కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మాలలకు పోరాటమే అసలైన వృత్తిగా భావించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మందకృష్ణ మాదిగ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు.