ఎమ్మార్పీఎస్ (దండోరా) రాష్ట్ర కార్యదర్శి తుంగపిండి రాజేష్ కుమార్...
మందమర్రి (విజయక్రాంతి): సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ వెంటనే అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ దండోరా రాష్ట్ర కార్యదర్శి తుంగపల్లి రాజేష్ కుమార్ కోరారు. శుక్రవారం ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీ చైర్మన్ రిటైర్డ్ జడ్జి శమీమ్ అక్తర్ ఆధ్వర్యంలో అదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఆయన పాల్గొని వర్గీకరణకు అనుకూలంగా వినతిపత్రం అందచేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. ఎస్సీలలో అత్యధిక వెనుకబడిన వర్గాలలో మాదిగ చర్మకార పారిశుద్ధ్య కులాల వారికి విద్య ఉద్యోగ రంగాలలో అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్య న్యాయాన్ని కల్పించాలని కోరారు.
తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు అత్యధికంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నారని వీరికి సరైన ఉపాధి అవకాశాలు లేక దుర్భర జీవితం గడుపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్య ఉద్యోగ ఉపాధి రంగాల్లో మాదిగలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దామాషాప్ జనాభా దామాషా ప్రకారం ఎస్సీ వర్గీకరణ ఏ పార్టీ మాదిగ ఉపకులాలకు చెందాల్సిన 12 శాతం వాటా రిజర్వేషన్లు అమలు చేయాలని తద్వారా మాదిగలు విద్యా ఉద్యోగ ఉపాధి పొందుతారని దీనిని దృష్టిలో పెట్టుకొని ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ చేపట్టి అమలు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొలిపాక సాంబయ్య, జిల్లా ఉపాధ్యక్షులు బచ్చలి భీమయ్య, మాదిగ జనసంక్షేమ సమితి వ్యవస్థాపకులు తుంగపిండి రామచందర్ లు పాల్గొన్నారు