calender_icon.png 1 March, 2025 | 10:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యమ అమరవీరుల త్యాగఫలమే ఎస్సీ వర్గీకరణ

01-03-2025 07:11:10 PM

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): ఉద్యమ అమరవీరుల త్యాగఫలమే ఎస్సీ వర్గీకరణ అని ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు పద్మారావు అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ కూడలి, 11వ వార్డు కాలనీలలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో అమరులైన ఉద్యమకారుల చిత్రపటాలకు ఎమ్మార్పీఎస్ నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కంది పద్మారావు మాట్లాడుతూ... జనాభా దామాషా ప్రకారం సామాజిక న్యాయం కోసం రిజర్వేషన్లలో ఎవరి జనాభా ఎంతో వారికి అంత వాటా ఉండాలని, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోరుతూ మందకృష్ణ ఆధ్వర్యంలో 30 ఏళ్లు సాగిన ఉద్యమంలో అమరులైన వీరుల త్యాగఫలమే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అని అన్నారు. మాదిగ జాతి మొదటి నుండి సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని, ఎక్కువ వాటా కోరుకోం తక్కువ ఇస్తే ఊరుకోం జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల వాటా దక్కాలని సుదీర్ఘ పోరాటం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు సామెల్ నరేష్, శివానందం,ఎల్లుబాబు, సాయిలు, పౌలయ్య, గంగారం, కుమార్, అరవింద్, పర్వయ్య తదితరులు పాల్గొన్నారు.