24-03-2025 12:00:00 AM
ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు గండి కృష్ణ మాదిగ
ముషీరాబాద్, మార్చి 23, (విజయక్రాం తి): పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పోరాట ఫలితంగానే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు గండి కృష్ణ మాదిగ అన్నారు. ఈ మేరకు ఆదివా రం ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించినందుకు అభినందిస్తూ భోలక్ పూర్ ఇందిరానగర్ ఎమ్మార్పీఎస్ భోలక్‌పూర్ డివిజన్ అధ్యక్షుడు దశరథ్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన గండి కృష్ణ మాది గ మాట్లాడుతూ 30 ఏళ్లుగా అలుపెరుగని పోరాటం చేసిన మందకృష్ణ మాదిగని రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరని అన్నారు. అనంతరం డప్పుల వాయిస్తూ ర్యాలీగా వెళ్లి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీ ఎస్ ముషీరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి గజ్జల రాజశేఖర్ మాదిగ, నాయకులు ఎల్ల య్య, నందగిరి నరసింహ, కే.ఎల్ సత్యనారాయణ, వెంకటయ్య, నందు, జీవన్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.