హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 3 (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణకు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చట్టం తీసుకురావాలని సీపీఐ (ఎంఎల్ న్యూడెమోక్రసీ) జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్రన్న కోరా రు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పు అట్టడుగు వర్గాల ప్రజల విజయం అని ఆయన శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు తీర్పును తక్షణమే అమల్లోకి తీసుకురావాలన్నారు. సామాజిక న్యాయమే లక్ష్యంగా 30 ఏళ్లుగా కొనసాగిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్‌పీఎస్) ఉద్యమానికి న్యూడెమోక్రసీ, వివిధ అనుబంధ సంఘాలు అండగా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.