calender_icon.png 20 April, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ వర్గీకరణ చారిత్రక నిర్ణయం

17-04-2025 12:00:00 AM

గూడూరు, ఏప్రిల్ 16 (విజయ క్రాంతి): ఎస్సీ వర్గీకరణ చట్టం చేసి జీవో విడుదల చేయడం చారిత్రక నిర్ణయమని డిసిసి కార్యదర్శి వాంకుడోత్ కొమ్మలు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిట్టే వెంకన్న అన్నారు. గూడూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో ఎమ్మార్పీఎస్ మహబూబాబాద్ జిల్లా ఇన్చార్జి బోడ ఎల్లయ్య, మండల యూత్ అధ్యక్షుడు  చప్పట్ల రాము, గూడూరు టౌన్ అధ్యక్షులు బోడ రవి వర్మ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, మందకృష్ణ మాదిగ, మేడి పాపయ్య మాదిగ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ఐ  నాయకులు బీరం శ్రీ పాల్ రెడ్డి, చంటి, స్వామి, రాసమల్ల యాకయ్య, అరేం వీరస్వామి, ఎండి రసూల్, ఎమ్మార్పీఎస్ నాయకులు చప్పట్ల రాము, బోడ రవి వర్మ, సూరయ్య, పోలపాక యాకయ్య, నెమలి సాంబయ్య, బోడ సాంబయ్య, జేరిపోతుల సాంబయ్య, జన్ను నరసయ్య, కృష్ణ, గణేష్ తదితరులు పాల్గొన్నారు.