- ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు తీవ్ర అన్యాయం
- ‘లక్ష డప్పులు వేల గొంతులు’ వాయిదా వేస్తున్నాం
- ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
హైదరాబాద్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి) : ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు తీవ్ర అన్యాయం జరిగిందని, జనాభా నిష్పత్తిలో వర్గీక రణ చేయలేదని ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాది గ తెలిపారు. మాదిగల రిజర్వేషన్‌ను 11 శాతం నుంచి 9శాతానికి తగ్గించడంలో పెద్ద కుట్ర దాగి ఉందని పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి రాజనర్సింహ, ఎమ్మెల్యే వివేక్ కలిసి మాదిగలకు అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు. సర్వే సమయంలోనే వీరు నివేదికను ప్రభావితం చేసి మాదిగల రిజర్వేషన్లు తగ్గేలా, మాలల రిజర్వేషన్లు పెరిగేలా చేశారని విమర్శించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో బుధవారం మందకృష్ణ మాదిగ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ నెల 7న చేపట్టిన లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని, ప్రస్తుతం దాన్ని వాయిదా వేస్తున్నామని... 15 రోజుల తరవాత సాంస్కృతిక మహోత్సవంగా, ప్రపం చం ఆశ్చర్యపోయేలా నిర్వహిస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఏకసభ్య కమిషన్ నివేదిక ఉండటాన్ని స్వాగతిస్తున్నామన్నారు.
ఏకసభ్య కమిషన్ నివేదికను అనుసరించి ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా రాష్ర్ట ప్రభుత్వం ముందుకు రావడం కూడా అభినందనీయమేనని తెలిపారు. 30 ఏళ్లల్లో ప్రభుత్వాలు వేసిన కమిషన్లు వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాయన్నారు. కమిషన్ నివేదికను ఉన్నది ఉన్నట్లుగా అమలు చేయకుండా... క్రీమిలేయర్ ఉండాలని కమిషన్ సూచించినా ప్రభుత్వం తిరస్కరించిందన్నారు.
అలాంటప్పుడు ఎస్సీల్లోని 59 కులాల్లో మాదిగల జనాభాకు అనుగుణంగా తమ వాటా ఇవ్వాలన్నారు. జనాభా, వెనకబాటుతనాన్ని చూసి మాదిగలకు 9 శాతం కల్పించారా అని ప్రశ్నించారు. వర్గీకరణను అడ్డుకునేది మాల సామాజికవర్గాని కి చెందిన నేతలేనని స్పష్టం చేశారు.
15లక్షల జనాభా ఉన్న మాలలకు 5 శాతం ఇచ్చారు.. 11 శాతం ఇవ్వాల్సిన మాదిగలకు మాత్రం 9 శాతానికే కుదించారని అన్నారు. రాష్ర్ట ప్రభుత్వం ఈ లోపాన్ని సరిచూసుకుని ముందుకు వెళ్లాలని డిమాండ్ చేశారు.
గంటా చక్రపాణి కులానికి ప్రాధాన్యం
పంబాల కులానికి చెందిన ఘంటా చక్రపాణి ఇంట్లోనే ఇద్దరు ప్రొఫెసర్లు ఉన్నారని, వెయ్యి మందిలేని పంబాల కులంలో వంద మంది ఉద్యోగులు ఉన్నారని మందకృష్ణ చెప్పారు. ఆర్థికంగా అభివృద్ధి చెందిన వారి కులం వెనకబాటుతనానికి గురైన జాబితాలోకి ఎట్లా జంప్ అయ్యిందని ప్రశ్నించారు.
మాదిగల ప్రాతినిధ్యం పెరగవద్దు.. మాలల ప్రాతినిధ్యం పెరగాలనే కుట్ర దాగిఉంద న్నారు. దళితుల్లో అత్యధిక జనాభా ఉన్న కులం నేతకానీ అని, కానీ వారిని తీసుకుపోయి మాలలు ఉన్న గ్రూపు లో కలిపేసి అన్యాయం చేశారని అన్నారు.
వివేక్ కుమారుడికి ఎంపీ ఎన్నికల్లో ఓట్ల కోసం నేతకాని కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు కానీ, 1.13 లక్షల జనాభా ఉన్న నేతకానీ కులానికి మాత్రం ప్రత్యేక గ్రూపు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణ అంశంలో జనాభా చూస్తున్నారా.. వెనుకబాటు చూస్తున్నారా అన్నది స్పష్టం చేయాలన్నారు.
దామోదర ఫెయిలయ్యారు..
మాలలకు తగినంత జనాభా లేకపోయినా ఇతరులను చేర్చుకుని ఎమ్మెల్యే వివేక్ మాలలకు అండగా నిలిచారని కానీ మాదిగలకు దక్కాల్సిన వాటాను రాబట్టడంలో మంత్రి దామోదర రాజనర్సింహ విఫలమయ్యారని ఆరోపించారు. దామోదర రాజనర్సింహను తాము మాదిగ బిడ్డగా చూడటం లేదన్నారు. ఆయన మాదిగల ప్రయోజనా లు కాపాడలేదని తెలిపారు.
మంత్రివర్గ విస్తరణలో దామోదర రాజనర్సింహను తప్పిం చి ఆయన స్థానంలో ఇద్దరు మాదిగలకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంత్రి పదవుల్లో రెడ్లు నలుగురు ఉన్నప్పుడు.. మాదిగలు ఇద్దరు ఉంటే తప్పేంటన్నారు.
మాదిగల నిష్పత్తి కంటే వాటా తగ్గిందని సీఎంకు ముందే తెలుసునని,దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నా రు. ఎస్సీల్లో ఎవరి జనాభా ఎంతో.. వారికి అంతే వాటా దక్కాలనేది తమ డిమాండ్ అని, తాము మిగతా వారి రిజర్వేషన్లను లాక్కోవాలని కోరుకోవడం లేదన్నారు.