calender_icon.png 5 February, 2025 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

3 గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ

05-02-2025 02:12:57 AM

ఏకసభ్య కమిషన్ సిఫార్సు

హైదరాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వర్గీకరణ అంశం మరో కీలక  మలుపు తీసుకున్నది. ఎస్సీ వర్గీకరణపై  జస్టిస్ షమీమ్ అక్తర్ చైర్మన్‌గా ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ సమర్పించిన నివేదికను మంగళవారం రాష్ట్రప్రభుత్వం విడుదల చేసింది. ఈ అంశంపై అధ్యయనం చేసి, వారిని 59 ఉప కులాలుగా కమిషన్ గుర్తించింది.

వాటిని మూడు గ్రూప్‌లు విభజించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. గ్రూప్1లోని 15 ఉప కులాలకు 1 శాతం రిజర్వేషన్లు, గ్రూప్ 18 ఉప కులాలకు తొమ్మిది శాతం, గ్రూప్ 26 ఉప కులాలకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలని సూచించింది. అంటే.. మొత్తంగా ఎస్సీలకు మొత్తం 15 రిజర్వేషన్లు అమలు చేయాలని సిఫార్సు చేసింది.

గ్రూప్ ఎస్సీ ఉప కులా ల జనాభా రాష్ట్రంలో 3.288 శాతం, గ్రూప్ జనాభా 62.748 శాతం, గ్రూప్ జనాభా 33.963 శాతం మంది అని తేల్చింది. ఎస్సీ కులాల గ్రూప్‌లకు రోస్టర్ పాయింట్లు, క్రిమీలేయర్ విధానాన్ని సైతం అమలు చేయా లని కమిషన్ తెలిపింది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పు అమలుకు కట్టుబడి ఉంటామని సర్కార్ స్పష్టం చేసింది.

ఏకసభ్య కమిషన్ 82 రోజుల పాటు ఎస్సీ వర్గీకరణ అంశంపై అధ్యయనం చేసింది. 4,750 విజ్ఞప్తుల ను స్వయంగా స్వీకరించింది. ఆఫ్ లైన్, ఆన్‌లైన్ ద్వారా మరో 8,681 విజ్ఞా          పనలు అందుకున్నది. అనంతరం కమిషన్ 199 పేజీల నివేదికను సర్కార్‌కు సమర్పించింది.     

 

వర్గీకరణ ఇలా..

* 59 ఉప కులాలుగా విభజన 

* మొత్తం 15% రిజర్వేషన్లు

* గ్రూప్-Iలోని ఉప కులాలకు 1%

* గ్రూప్-IIలోని ఉప కులాలకు 9%

* గ్రూప్-IIIలోని ఉప కులాలకు 5%