calender_icon.png 22 December, 2024 | 10:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ వర్గీకరణ కమిటీని రద్దు చేయాలి

13-09-2024 04:32:47 PM

నిర్మల్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ కొరకు ఏర్పాటుచేసిన కమిటీని రద్దు చేయాలని కోరుతూ శుక్రవారం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నిర్మల్ జిల్లా ప్రెస్ క్లబ్ లో సమావేశం ఏర్పాటు చేసింది. జిల్లా కన్వీనర్స్ బత్తుల రంజిత్, కుంటోళ్ళ వెంకట స్వామి మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వర్గీకరణ కమిటీలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారని సెట్టింగ్ హైకోర్టు రిటైర్డ్ జడ్జితో కమిటీ వేయాలని ఇప్పుడున్న కమిటీని తెలంగాణలోని మాలలు వ్యతిరేకించాలన్నారు. కమిటీని రద్దు చేయకపోతే రాబోవు రోజులలో కాంగ్రెస్ పార్టీ నాయకులను గ్రామాలలోకి రానివ్వమని, చంద్రబాబు నాయుడుకి పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ కమిటీని రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్లు బొడ్డు లక్ష్మణ్, పురుషోత్తం, రత్నయ్య, గిరి,నాని భోజన్న పాల్గొన్నారు.