18-03-2025 08:35:18 PM
కామారెడ్డి (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీ సమావేశంలో ఆమోదం చేసినందుకు కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మంగళవారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని వారి ఛాంబర్ లో కలిసి సన్మానించి పుష్పగుచ్చంతో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొన్నారు. అలాగే కామారెడ్డి జిల్లా ఎమ్మార్పీ అధ్యక్షులు సీఎం రేవంత్ రెడ్డికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు అభినందనలు తెలిపారు.