calender_icon.png 5 February, 2025 | 5:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ వర్గీకరణ బిల్లు అభినందనీయం

04-02-2025 10:59:17 PM

వికారాబాద్: ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం ఎంతో శుభ పరిణామమని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ ఏ.చంద్రశేఖర్ అన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీమంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. నాటి పిసిసి అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  చేవెళ్ల సభలో ఎస్సీ డిక్లరేషన్ హామీ ఇచ్చి నేడు ముఖ్యమంత్రిగా అసేంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి, అమలు పర్చేందుకు తీసుకుంటున్న చర్యలు శూభ పరిణామం అని అన్నారు. 30,40 ఏళ్ళ కల సాకారం కాబోతుంది అని సంతోషం వ్యక్తం చేశారు . గతంలో ఎవరు చేయలేక పోయారని అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన వెంటనే దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  అసేంబ్లీ లో ప్రకటన చేశారు అని, మాదిగల గురించి ఆలోచించే వ్యక్తి, మాదిగల సమస్యలపై అవగాహన ఉన్నా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు. మాదిగలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అయన తెలిపారు.