calender_icon.png 26 October, 2024 | 5:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

వీధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

01-09-2024 05:12:47 PM

డిప్యూటీ డైరెక్టర్ పోటు రవీందర్ రెడ్డి

లక్షెట్టిపేట, (విజయక్రాంతి): విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డిప్యూటీ డైరెక్టర్ పోటు రవీందర్ రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎస్సీ బాలుర, బాలికల వసతి గృహాలను ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పోటు రవీందర్ రెడ్డి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహంలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాల గురించి విద్యార్థులనడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతపై విద్యార్థులు దృష్టి సారించేలా చర్యలు చేపట్టాలని వసతి గృహ సంక్షేమాధికారి రాజును ఆదేశించారు. విద్యార్థులకు జ్వరం, ఇతర అనారోగ్య లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లాలని, అదే విధంగా పిల్లల తల్లిదండ్రులకు సమాచారం కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అంతకుముందు వంట గదులను పరిశీలించి విద్యార్థుల భోజనం గురించి వాకబు చేశారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని, పిల్లల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలని వార్డెన్ సునీత, రాజు లకు సూచించారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు, సిబ్బందికి సంబంధించిన పలు రకాల రిజిస్టర్స్ పరిశీలించారు. ఈ తనిఖీ లో ఆయా హాస్టల్స్ వార్డెన్స్, సిబ్బంది ఉన్నారు.