వాల్మీకీ ప్రసన్నానంద
బెంగుళూర్ (కర్ణాటక): ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి వినియోగిచాల్సిన నిధులను కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర పథకాలకు వినియోగిస్తోందని వాల్మీకీ ప్రసన్నానంద పూరి స్వామీజీ ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన 5 హామీలను నెరవేర్చేందుకు ఎస్సీ, ఎస్టీకు దక్కాల్సిన నిధులను దారిమల్లిస్తోందన్నారు. “మేము ఏ ఒక్క వర్గం అభివృద్ధిని అడ్డుకోం. ప్రజ లు తద్వారా దేశం అభివృద్ధి చెందాలనేదే మా ఉద్దేశం” అని స్వామీజీ చిత్ర దుర్గలో జరిగిన ఓ సమావేశంలో తెలిపారు. “ప్రజలకిచ్చిన 5 హామీలను అమలు చేయండి. సహకరిస్తాం. అంతేకాని వాటి కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీల నిధుల దుర్వినియోగం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం. సిద్దరామయ్య ప్రభుత్వం ఇప్పటివరకు దాదాపు రూ.14వేల కోట్ల ఎస్సీ, ఎస్టీల నిధులను ఇతర ప్రయోజనాలకు వాడుకు ంది” అని ఆరోపించారు. ఇదే విషయమై జాతీయ ఎస్సీ కమిషన్ కర్ణాట క ప్రభుత్వానికి నోటీసులు జారీచేసిందని స్పష్టం చేశారు. కానీ అంతా చట్ట ప్రకారమే జరుగుతోందని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు.