కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ డిమాండ్
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 26 (విజయక్రాంతి): ఎన్నికల ప్రచారంలో భాగం గా చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను అమలు చేయాలని కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జాన్‌వెస్లీ, స్కైలాబ్‌బాబు డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ.. అంబేడ్కర్ అభయహస్తం పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.రెండువేల కోట్లు కేటాయించిందని కానీ దాని మార్గదర్శకాలను రూపొందించలేదన్నారు. 2018 నుంచి ఎస్సీ కార్పొరేషన్ రుణాలు పెండింగ్‌లో ఉన్నాయని వెంటనే రుణాలు విడదల చేయాలని కోరారు.
సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులకు నెలకు రూ.2,500 మెస్ చార్జీ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సెప్టెంబరు 2న కలెక్టరేట్‌ల ఎదుట ధర్నాలు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో కేవీపీఎస్ రాష్ట్ర నాయకులు ఎం కురుమయ్య, పి.నాగార్జున, ఎం.ప్రకాశ్‌కరత్, మానిక్యం, మనోహర్, పల్లెర్ల లలిత, దుడ్డెల రామ్మూర్తి, బొట్ల శేఖర్, దుర్గం దినకర్ పాల్గొన్నారు.