10-03-2025 12:56:46 AM
నల్లగొండ, మార్చి 9 (విజయక్రాంతి) : నల్లగొండ జిల్లాలో ఈ నెల 11, 12వ తేదీల్లో రాష్ర్ట ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. చైర్మన్ బక్కి వెంకటయ్య అధ్యక్షతన సభ్యులు కుస్రం నీలాదేవి, రాంబాబు నాయక్, కొంకతి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణిగుంట్ల ప్రవీణ్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు, సివిల్ కేసులపై సమీక్షించనున్నట్లు పేర్కొన్నారు.
11న మధ్యాహ్నం కమిషన్ సభ్యులు సూర్యాపేట నుంచి నల్లగొండ కలెక్టరేట్‌కు చేరుకొని సాయంత్రం వరకు సమీక్ష నిర్వహిస్తారని వెల్లడించారు. అనంతరం నాగార్జునసాగర్ చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు. 12న ఉదయం ఇరిగేషన్, ట్రాన్స్‌కో, జెన్‌కో అధికారులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కొండమల్లేపల్లి మండలం పిలియా తండాలో వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం నల్లగొండ నుంచి హైదరాబాద్ చేరుకుంటారని కలెక్టర్ తెలిపారు.