06-04-2025 03:21:39 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి శాంతిఖని గని టీబీజీకేఎస్ మాజీ ఫిట్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్ ను ఆదివారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్ పరామర్శించారు. ఇటీవల దాసరి శ్రీనివాస్ తండ్రి ఆనారోగ్యంతో మృతి చెందారు. బెల్లంపల్లిలోని స్టేషన్ రోడ్ కాలనీలో నే ఉంటున్న ప్రవీణ్ దాసరి శ్రీనివాస్ ఇంటికి వెళ్లి అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు.