calender_icon.png 25 December, 2024 | 12:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నెలలో ఎస్సీ, ఎస్టీ కేసులు పరిష్కరించాలి

19-10-2024 01:17:33 AM

ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య

జనగామ, అక్టోబర్ 18(విజయక్రాంతి): నెల రోజుల్లో ఎస్‌స్సీ, ఎస్టీ పెండింగ్ కేసుల న్నీ పరిష్కారించాలని అధికారులను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు. శుక్రవారం జనగామ కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. యాక్షన్ ప్లాన్ ప్రకా రం సివిల్ రైట్స్ డేను పకడ్బందీగా నిర్వహించి చట్టాలపై ప్రజలకు అవగాహన క ల్పించాలన్నారు.

మూడు నెలలకోసారి విజిలెన్స్, మానిటరింగ్ సమావేశాన్ని తప్పని సరిగా పెట్టాలన్నారు. జిల్లాలో ఎస్‌స్సీ, ఎస్టీల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం యం త్రాంగం కృషి చేస్తోందని కలెక్టర్ రిజ్వాన్ బాషా చెప్పారు.  కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్రనాయక్, అడిషనల్ కలెక్టర్ రోహిత్‌సింగ్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబునాయక్, జిల్లా శంకర్, ఆర్. ప్రవీణ్, లక్ష్మీనారాయణ  పాల్గొన్నారు.