calender_icon.png 15 January, 2025 | 8:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఐపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

06-07-2024 02:12:44 AM

అశ్వారావుపేట,జూలై 5:  అశ్వారావుపేట ఎస్‌ఐ శ్రీరాముల శ్రీను ఆత్మహత్యయత్నం సంఘటన కీలకమలుపు తిరిగింది. ఈ ఉదంతంలో సీఐ, నలుగురు సిబ్బందిపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదయ్యాయి. ఎస్‌ఐ శ్రీను ప్రస్తుతం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎస్‌ఐ ఆత్మహత్యాయత్నానికి అశ్వా రావుపేట సీఐ జితేందర్‌రెడ్డి, కానిస్టేబుళ్ళు శివ, సుభాని, సన్యాసినాయుడు, శేఖర్ వేధింపులే కారణమంటూ కుటుంబసభ్యులు, దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ఈ ఘటనపై శుక్రవారం ఎస్‌ఐ శ్రీను భార్య కృష్ణవేణి హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కృష్ణవేణి ఫిర్యాదు మేరకు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి చట్టం సెక్షన్ 306, 511రెడ్ విత్ 34 ఐపీసీ కింద కేసు పోలీసులు నమోదు చేశారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసును మహబూబాబాద్  పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇప్పటికే ఈ కేసుతో సంబంధమున్న సీఐని ఐజీ కార్యాలయానికి అటాచ్ చేయగా, నలుగురు కానిస్టేబుళ్లనను వీఆర్‌కు పంపారు. తాజాగా శ్రీను భార్య ఫిర్యాదుతో వారిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.