calender_icon.png 1 January, 2025 | 10:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్బీఐ లాభం రూ.19,782 కోట్లు

09-11-2024 01:53:04 AM

ఇతర ఆదాయం తోడ్పాటుతో 23% వృద్ధి

న్యూఢిల్లీ, నవంబర్ 8: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా (ఎస్బీఐ) కన్సాలిడేటెడ్  నికరలాభం ఈ సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో 23 శాతం వృద్ధిచెంది రూ. 19,782 కోట్లకు చేరింది. బ్యాంక్ లాభాల పెరుగుదలకు వడ్డీయేతర ఆదాయం, ట్రెజరీ లాభాలు తోడ్పడ్డాయి. స్టాండెలోన్ ప్రాతిపదికన ఎస్బీఐ రూ. 18,331 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. ఏడాది క్రితం ఇది రూ. 14,330 కోట్లుకాగా, ఈ ఏడాది క్యూ1లో రూ.17,035 కోట్ల స్టాండెలోన్ నికరలాభాన్ని సాధించింది. 

వడ్డీ ఆదాయం 5 శాతం వృద్ధి

ఎస్బీఐ అడ్వాన్సులను జోరుగా 15 శాతం పెంచుకున్నప్పటికీ  నికర వడ్డీ ఆదా యం మాత్రం ఈ క్యూ2లో 5.37 శాతమే వృద్ధిచెందింది. నికర వడ్డీ మార్జిన్ 3.14 శాతానికి తగ్గడమే ఇందుకు కారణం. మరోవైపు ఫారెక్స్, ట్రెజరీ కార్యకలాపాల ద్వారా లాభాలు ఆర్జించడంతో వడ్డీయేతర ఆదాయాన్ని బ్యాంక్ 42 శాతం పెంచుకున్నది. రూ.15,271 కోట్ల వడ్డీయేతర ఆదాయాన్ని ఆర్జించింది. ఆస్తుల నాణ్యతకు సంబంధించి బ్యాంక్ తాజా మొండి బకాయిలు క్యూ2లో రూ.3,867 కోట్ల నుంచి రూ. 3,831 కోట్లకు తగ్గాయి. సెప్టెంబర్ 30నాటికి స్థూల ఎన్‌పీఏలు 2.21 శాతం నుంచి 2.13 శాతానికి మెరుగుపడ్డాయి. క్యాపిటల్ అడిక్వసీ రేషి యో 13.76 శాతంగా ఉన్నది. 

సబ్సిడరీల పనితీరు

ఎస్బీఐ సబ్సిడరీల్లో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నికరలాభం రూ. 761 కోట్ల నుంచి రూ. 1,049 కోట్లకు పెరిగింది. క్రెడిట్ కార్డ్ సంస్థ లాభం రూ.1,196 కోట్ల నుంచి రూ. 999 కోట్లకు తగ్గింది. ఫండ్ మేనేజ్‌మెంట్ సబ్సిడరీ నికరలాభం రూ. 940 కోట్ల నుంచి రూ. 1,374 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో శుక్రవారం ఎస్బీఐ షేరు 1.86 శాతం క్షీణించి రూ. 843 వద్ద ముగిసింది. 

డిపాజిట్లు పెంచుకోవడమే 

లక్ష్యం : చైర్మన్ శ్రీనివాసులు శెట్టి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకు న్న 14-16 శాతం అడ్వాన్సుల వృద్ధి లక్ష్యా న్ని ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో కొనసాగించామని, కానీ డిపాజిట్ల వృద్ధి లక్ష్య మై న 12-13 శాతం దిగువస్థాయిలో 10 శాత మే వృద్ధిచెందాయని ఎస్బీఐకి కొత్తగా నియమతులైన చైర్మన్ శ్రీనివాసులు శెట్టి తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12-13 శాతం కాకపోయినా, రెండంకెల్లో వృద్ధి సాధిస్తామన్న విశ్వాసం తనకు  ఉన్నదని శెట్టి శుక్రవారం మీడియాకు  వివరించారు. 

లక్ష కోట్ల లాభం ఆశయం

దేశంలోని వాణిజ్య సంస్థల్లోకెల్లా బ్యాంక్ అత్యధిక లాభాన్ని ఆర్జించిందని, ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1 కోట్ల లాభా న్ని సాధించాలని ఎస్బీఐ కోరుకుంటున్నదని శెట్టి చెప్పారు. అయితే ఎంతకాలానికి ఇది నెరవేరుతుందో వెల్లడించేందుకు నిరాకరించారు. తొలుత ఆపరేటింగ్ లాభాన్ని రూ.1 లక్ష కోట్లకు చేర్చాలన్నది లక్ష్యమని, తదుపరి నికరలాభాన్ని లక్ష కోట్లకు చేరడంపై దృష్టిపెడతామన్నారు. 

ఫిబ్రవరిలోపు ఆర్బీఐ రేట్ల కోత ఉండదు

ఫిబ్రవరిలోపుగా రిజర్వ్‌బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను తగ్గించదని తమ బ్యాంక్ అంచనా వేసున్నట్లు ఎస్బీఐ చైర్మన్ చెప్పా రు. తాము లాభాల మార్జిన్లను నిలబెట్టుకుంటామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. డిపాజిట్ రేట్లు గరిష్ఠస్థాయికి చేరాయని, దీంతో నికర వడ్డీ మార్జిన్లు స్థిరంగా ఉంటాయని చెప్పారు. మహిళలు, సీనియర్ సిటిజ న్లకు త్వరలో ప్రత్యేక పథకాల్ని ప్రవేశపెడతామని, ఇటీవల ఆవిష్కరించిన ‘ప్రీమియర్’ బ్రాండ్ ద్వారా డిపాజిట్ల సమీకరణ పెరుగుతుందని భావిస్తున్నట్లు శెట్టి వివరించారు. బ్యాంక్ క్రెడిట్ డిపాజిట్ రేషియో సరైనస్థాయిలో 67 శాతంగా ఉన్నదని, డిపాజిట్లలో మార్కెట్ వాటాను పెంచుకోవడంపై దృష్టిపెడతామన్నారు.