న్యూఢిల్లీ, నవంబర్ 27: తాజాగా రూ 10,000 కోట్లు ఇన్‌ఫ్రా బాండ్ల ద్వారా సమీకరించడంతో ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ తమ మొత్తం నిధుల సమీకరణ రూ. 50,000 కోట్లకు చేరిందని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. తమ బాండ్ ఇష్యూలన్నింటికీ ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించిందని, ఇష్యూ పరిమాణంతో పోలిస్తే 2 రెట్లకుపైగా ఓవర్‌సబ్ స్క్రయిబ్ అయ్యాయని, బ్యాంక్ పట్ల ఇన్వెస్టర్లకు ఉన్న విశ్వాసానికి ఇది సూచిక అని ఎస్బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టి తెలిపారు. ప్రావిడెంట్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్, బ్యాంక్‌లు తమ బాండ్లలో పెట్టుబడి చేసినట్లు వెల్లడించారు.