calender_icon.png 6 February, 2025 | 4:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధ్యతలు స్వీకరించిన ఎస్‌బీఐ స్టాఫ్ యూనియన్

06-02-2025 01:08:22 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ హైదరాబాద్ సర్కిల్ నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన చక్రవర్తుల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి కే శ్రీనివాస శాండిల్య, కార్యవర్గ సభ్యులు బుధవారం బాధ్యతలు స్వీరించారు.

ఈ కార్యక్రమంలో ఆ యూనియన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. జనవరి 25, 26 తేదీల్లో ఆ సంఘం ప్రధాన కార్యదర్శి రాజగోపాలన్ శ్రీరామ్, అధ్యక్షుడు చక్రవర్తుల శ్రీధర్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు.

సుమారు ఆరు వేల మంది ఎస్‌బీఐ స్టాఫ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న శ్రీరాం పదవి విరమణ పొందుతున్న కారణంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.