calender_icon.png 29 March, 2025 | 4:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రతా దళాలపై గౌరవాన్ని చాటుకున్న ఎస్‌బీఐ

26-03-2025 12:02:43 AM

  • ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఫండ్‌కు రూ.37.16లక్షల విరాళం

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు చెక్కు అందజేత

హైదరాబాద్, మార్చి 25: భద్రతా దళాల పట్ల హైదరాబాద్ సర్కిల్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఉద్యోగులు తమకున్న గౌరవాన్ని చాటుకున్నారు. సామాజిక బాధ్యతగా ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఫండ్‌కు రూ.37.16లక్షల విరాళాన్ని అందజేశారు.

ఉద్యోగుల తరఫున హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేశ్ కుమార్ మంగళవారం రాజ్‌భవన్‌కు వెళ్లి విరాళానికి సంబంధించిన చెక్కును తెలంగాణ గవర్నర్, ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఫండ్ చైర్పర్సన్ జిష్ణుదేవ్ వర్మకు అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్బీఐ ఉద్యోగులను గవర్నర్ అభినందించారు. సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం ఇస్తున్న ఈ మద్దతును ఇకపై కూడా కొనసాగించాలని సూచించారు.

దేశ ప్రగతి కోసం సమాజానికి తన వంతు సాయం చేయాలని ఎస్బీఐ ఉద్యోగులు బలంగా విశ్వసిస్తున్నట్టు ఈ సందర్భంగా రాజేశ్‌కుమార్ పేర్కొన్నారు. కాగా ఈ కార్యక్రమంలో తెలంగాణ సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ కల్నల్ రమేశ్ కుమార్, కెప్టెన్ సంజయ్ అపేజ్, ఎస్‌బీఐ డీజీఎం జితేంద్రకుమార్ శర్మ తదితరులు ఉన్నారు.