22-02-2025 12:13:09 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రాష్ట్రంలో మరో 10 కొత్త బ్రాంచ్‌లను ప్రారంభించింది. ఈ మేరకు చైర్మన్ చల్లా శ్రీనివాసులు సెట్టి హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేశ్ కుమార్‌తో కలిసి నూతనంగా ఏర్పాటు చేసిన శాఖలను షురూ చేశారు.
ప్రస్తుతం కొత్తగా అలంపూర్ క్రాస్ రోడ్డు, చిన్నంబావి, రాఘవేంద్ర కాలనీ (కొండాపూర్), నియోపోలీస్, కిష్టారెడ్డిపేట్ (పటాన్‌చెరు), ఖాజాగూడ, ఉస్మాన్ నగర్, కంగ్టి (నారాయణ్‌ఖేడ్), సుచిత్ర సర్కిల్, నాంపేట బ్రాంచ్‌లు ఉన్నాయి. వీటిలో ఐదు గ్రామీణ కేంద్రాల్లో, ఐదు పట్టణ కేంద్రాల్లో ఉన్నాయి.
ఈ సందర్భంగా ఎస్‌బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసుల సెట్టి మాట్లాడుతూ వినియోగదారుల విశ్వానికి ఎస్‌బీఐ కేంద్రంగా పనిచేస్తోందన్నారు. భారతదేశం ఆర్థిక శక్తిగా ఎదగడంలో ఎస్‌బీఐ పాత్ర గతం కంటే ప్రస్తుతం చాలా కీలకమైందన్నారు. దేశ ఆర్థికాభివృద్ధికి ఉద్యోగులంతా కృషి చేయాలన్నారు.