calender_icon.png 31 October, 2024 | 12:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండియాలో బెస్ట్ బ్యాంక్ ఎస్బీఐ

28-10-2024 12:00:00 AM

గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ఎంపిక

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా (ఎస్బీఐ)కు అరుదైన గుర్తింపు లభించింది. 2024 సంవత్సరానికి భారత్‌లోకెల్లా ఎస్బీఐ అత్యుత్తమ బ్యాంక్‌గా గ్లోబల్ ఫైనా న్స్ మ్యాగజైన్ ఎంపికచేసింది. వాషింగ్‌టన్‌లో జరిగిన ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ వార్షి క సమావేశాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో యూఎస్‌కు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ 2024 సంవత్సరపు ఉత్తమ బ్యాంక్ ఆవార్డులను ప్రకటించింది. 

బ్యాంకింగ్ సేవలు అందించడంలో, ఖాతాదారుల విశ్వాసాన్ని చూరగొని దేశవ్యాప్తం గా ఆర్థిక సేవలు విస్తరించడం బ్యాంక్ నిబద్ధతకు  గుర్తింపుగా లభించిన ఈ ఆవార్డును తమ చైర్మన్ శ్రీనివాసులు శెట్టి స్వీకరించార ని ఎస్బీఐ ప్రకటనలో తెలిపింది.