calender_icon.png 23 October, 2024 | 4:01 PM

ఇంకాస్త అంటూ..

09-07-2024 12:05:00 AM

కెరీర్ చివరి దశ వరకూ ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికి ఆసక్తి కనబరిచే హీరోయిన్లు చాలా మందే ఉంటారు. అలా సాహసాలు చేస్తూ ఏ పాత్రలో అయినా చక్కగా ఒదిగిపోతోంది నటి అంజలి. తెలుగులో ముఖ్యంగా ‘గీతాంజలి’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటివి చిత్రాల ద్వారా క్లీన్ ఇమేజ్ అంజలి సొంతమైంది. ఇటీవల ఏ పాత్రకైనా తాను సిద్ధమేనంటూ సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ వరుస అవకాశాలతో బిజీగా మారింది. అశోక్ దర్శకత్వలో తెరకెక్కుతున్న లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘ఈగై’లో ఓ సన్నివేశం కోసం ఎలాంటి డూప్ లేకుండా అంజలి 16 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకిందట.

మరోవైపు ఇటీవల విశ్వక్‌సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో వేశ్యగా కనిపించింది అంజలి. అంతటితో ఆగకుండా మళ్లీ అదే క్యారెక్టర్‌తో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నెల 19 నుంచి జీ5లో స్ట్రీమ్ కానున్న ‘బహిష్కరణ’ సినిమాలో పుష్ప అనే వేశ్య పాత్రతో అలరించనున్నది. సినిమాల వరకు గ్లామర్ డోస్ కాస్త తక్కువే అనిపిస్తున్నప్పటికీ వెబ్ సిరీస్‌ల విషయంలో మాత్రం అంజలి తగ్గేదే లేదంటూ ఇంకాస్త రెచ్చిపోతోందంటున్నారు. కెరీర్ చివరి దశలో డేరింగ్ క్యారెక్టర్స్ చేస్తున్న ఈ రాజోలు రాజసం.. శంకర్ దర్శకత్వంలో వస్తున్న రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’లోనూ ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది.