- భూసేకరణ చట్టం అమలు చేశామనడం అబద్ధం
- మూసీ బాధితులకు పరిహారం విషయంలో పార్లమెంట్‌నే తప్పుదోవ పట్టించారు
- దానిపై బహిరంగ చర్చకు సిద్ధమేనని సీఎంకు మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్
హైదరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): కేంద్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తు న్నది ఒకటి.. రాష్ట్రంలో అమలు చేస్తున్నది మరొకటని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. మూసీ బాధితులకు పునరావా సం విషయంలో రాష్ర్ట ప్రభుత్వం కేంద్రాన్ని, పార్లమెంట్‌ను, దేశాన్ని తప్పుదోవ పట్టించడం సిగ్గుచేటన్నారు.
భూసేకరణ చట్టం 2013ను అమలు చేస్తున్నామని చెప్పడం పచ్చి అబద్ధమని అన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై వాస్తవాలను కాంగ్రెస్ ప్రభుత్వం దాచిపెడుతున్నదని ఆరోపించారు. పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు వచ్చిన సమాధానంతో కాంగ్రెస్ మోసపూరిత వైఖరి బయటపడిందని చెప్పారు.
మూసీ బాధితులకు పరిహారం విషయంలో పార్లమెంట్‌కు చెప్పిన అంశాలపై చర్చించేందుకు తాను సిద్ధమని.. ఎక్కడికి రావాలో ముఖ్యమంత్రి చెప్పాలని సవాల్ విసిరారు. గురువారం తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. భూసేకరణ చట్టం 2013 కంటే మెరుగైన చట్టాన్ని కేసీఆర్ రూపొందించి, అమలు చేశారని స్పష్టంచేశారు.
నిర్వాసితులకు 121 గజాల స్థలంలో ఇల్లు కట్టించాలని 2013 చట్టం చెబితే, దాన్ని కేసీఆర్ 250 గజాల స్థలం, డబుల్ బెడ్రూం ఇల్లుగా మార్చారని గుర్తుచేశారు. ఐఏవై ఇల్లు అంటే ఆ రోజు లక్షా 20 వేల మాత్రమేనని, డబుల్ బెడ్రూం ఇల్లు అంటే రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షలని చెప్పారు.
నష్టపోతున్న బాధితులనే గుర్తించలే
నష్టపోతున్న బాధితులను ప్రభుత్వం గుర్తించలేదని, అసైన్డ్ భూమి అయినా, ఎన్‌క్రోచ్‌మెంట్ అయినా, పట్టా భూమి అయి నా, ప్రభుత్వ భూమిలో ఉన్నా అందరికి సమాన హక్కులు ఉంటాయని చట్టం చెప్పిందని హరీశ్ అన్నారు. ముందుగా ఎనుమరే షన్ జరగాలని, 60 రోజుల సమయం ఇస్తూ దినపత్రికల్లో నోటీసు ఇచ్చి, వచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని అప్పుడు ప్రక్రియ ప్రారంభించాలని చెప్పా రు.
కానీ, ఇక్కడ నోటీసులు లేవు, డీపీఆర్ లేదు, ఎనుమరేషన్ లేదు.. ఇవేవి లేకుండా ఇండ్లు కూలగొట్టి కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూం ఇండ్లే ఇచ్చారని స్పష్టంచేశారు. హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చారని, ఓ చిన్న పాప పుస్తకాలు తెచ్చుకుంటా అంటే కూడా వదిలిపెట్టలేదని మండిపడ్డారు. కట్టుబట్టలతో ఇండ్ల నుంచి బయటకు గెంటేసార ని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చిన ఇండ్లకు నష్టపరిహారం ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు.
ఇప్పటికే 280 కుటుంబాల ఇండ్లు కూల్చేశారన్నారని, మానవత్వంతో ఇండ్లు ఇస్తున్నం అని పార్లమెంట్‌కు చెప్పారని.. మానవత్వం కాదు వారికి హక్కుగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుపేదల పక్షాన న్యాయస్థానానికి వెళ్తామని, చట్టం ప్రకారం ఆ పేదలకు సాయం చేసేందుకు కృషి చేస్తామన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని హరీశ్‌రావు స్పష్టంచేశారు.