ఈ డ్రగ్స్ మనకు అవసరమా డార్లింగ్స్: హీరో ప్రభాస్
హైదరాబాద్, డిసెంబర్ 31 (విజయక్రాంతి): డ్రగ్స్‌పై అవగాహన కల్పిస్తూ హీరో ప్రభాస్ మంగళవారం ప్రత్యేక వీడియో విడుదల చేశారు. జీవితంలో మనకు ఉన్న ఎంజాయ్‌మెంట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ అంతా వదిలేసి డ్రగ్స్‌కు బానిసలవ్వడమేంటని ప్రభాస్ ప్రశ్నించారు.
మాదకద్రవ్య రహిత సమాజం కోసం కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని కోరా రు. ‘లైఫ్‌లో మనకు బోలెడన్ని ఎంజాయ్‌మెంట్స్ మనకు ఉన్నా యి. కావల్సినంత ఎంటర్‌టైన్‌మెం ట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బతికే మనవా ళ్లు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్? ఇవాళే డ్రగ్స్ కు నో చెప్పేయండి.
మీకు తెలిసినవాళ్లు ఎవరైనా డ్రగ్స్‌కు బానిసలైతే 8712671111 నంబర్‌కు ఫోన్ చేయండి. డ్రగ్స్‌కు బానిసలైనవాళ్లు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది’ అని ప్రభాస్ తెలిపారు.