- పూలే, అంబేద్కర్ భావాలను భవిష్యత్ తరాలకు అందించాలి
- సావిత్రీబాయి 194వ జయంతి వేడుకల్లో మంత్రి సీతక్క
- పదేండ్లు ఏం చేశారు.. కవిత ధర్నాపై పీసీసీ చీఫ్ మహేశ్ ఫైర్
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 3(విజయక్రాంతి): చదువుల తల్లి సావిత్రీబాయి పూలే అని, చదువు ఉంటేనే హక్కులపై ప్రశ్నిస్తామని స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి ధన సరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. శుక్రవా రం రవీంద్రభారతిలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో, మహిళా అధ్యక్షురాలు మణిమం జరి అధ్యక్షతన జరిగిన సావిత్రీబాయి 194వ జయంతి ఉత్సవాలకు సీతక్క ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా సీతక్క మా ట్లాడుతూ సావిత్రీబాయి పూలే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని తాను, తమ పార్టీ నేతలు జనవరి 1న సీఎం రేవంత్‌రెడ్డిని కోరామని, ఈ మేర కు 2న జీవోను జారీ చేశారని ఆమె వెల్లడించారు. సావిత్రిబాయి పూలే స్ఫూర్తితోనే అం దరికీ విద్య అందుబాటులోకి వచ్చిందన్నా రు.
జ్యోతిరావ్‌పూలే, సావిత్రీబాయి పూలే, అంబేద్కర్ భావాలను భవిష్యత్ తరాలకు అందించాలని సూచించారు. గద్దర్, గూడ అంజయ్య లాంటి కళాకారులను గుర్తించి తమ ప్రభుత్వం గౌరవించిందన్నారు. కులగణన చేయాలని లోక్‌సభలో రాహుల్ గాంధీ ప్రశ్నించారని, తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి సమగ్ర సర్వే చేయించారన్నారు.
ఈ సర్వేను అడ్డుకోవాలని ఎంతో మంది కుట్ర లు చేశారని వాపోయారు. సమగ్ర సర్వే పూర్తయ్యాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఏడాదిగా ప్రత్యేకాధికారుల తో పాలన సాగిస్తున్నామన్నారు.
స్థానిక సం స్థల ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలయ్యేలా చేస్తామన్నారు. రాష్ట్రంలోని ఏదో ఒక యూనివర్సిటీకి జ్యోతిబాపూలే, సావిత్రీబాయి పూలే పేరు పెట్టేలా సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. అనంతరం వివిధ రంగాల్లో సేవలందించిన మహిళలకు సీతక్క అవార్డులు అందజేశారు.
కేసీఆర్ ఫాం హౌజ్‌లో ఎందుకున్నారు: పీసీసీ చీఫ్ మహేశ్
ప్రజలు 39 సీట్లు కట్టబెడితే, ప్రతిపక్ష బాధ్యతలు నిర్వర్తించకుండా మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌజ్‌లో ఎందుకున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ప్ర శ్నించారు. దీనికి కేటీఆర్, హరీశ్‌రావు సమాధానం చెప్పాలన్నారు. రవీంద్రభారతీలో జరిగిన సావిత్రీ బాయి పూలే జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడుతూ మహిళలు చదు వుకోవాలంటేనే భయపడే రోజుల్లో సావిత్రీబాయి పూలే బాలికల కోసం పాఠశాలలు స్థాపించారన్నారు.
బీసీ రిజర్వేషన్ల కోసం ధర్నా చేస్తున్న ఎమ్మెల్సీ కవిత, పదేండ్లు వారి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. వారి ప్రభుత్వంలోనే ధర్నా చౌక్‌ను ఎత్తేశారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని, అనం తరం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లను 34 శాతానికి పెంచిందన్నారు.
కానీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ రిజర్వేషన్లను తగ్గించిందని ఆరోపించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లో బీసీలకు ప్రాధాన్యత లేదని, పని చేసే బండి సంజయ్‌ని బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించారని, బీఆర్‌ఎస్‌లో కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా అవకాశం ఉం డదన్నారు. కాంగ్రెస్‌లోనే బీసీలకు అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు.
కార్య క్రమంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీ హన్మంతరావు, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్, మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్‌గౌడ్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.