10-03-2025 07:54:46 PM
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడలో సోమవారం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సావిత్రి బాయి పూలే వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ జుబ్బేర్ మాట్లాడుతూ... సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రిగా నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన సాయిత్రి బాయి ఫూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పించినట్లు తెలిపారు.
రిజర్వేషన్ల కోసం, సామాజిక న్యాయం కోసం, మహిళలకు విద్యావకాశాల కోసం విశేషంగా కృషి చేయడంతో పాటు, కుల, మత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన గొప్ప వ్యక్తి, ఎన్నో నిర్బంధాల మధ్య మహిళలకు విద్య అందించాలని సావిత్రి బాయి తపించి సొంత వనరులతో విద్యాలయాలు స్థాపించారు. వారి స్ఫూర్తితో కేసీఆర్ రాష్ట్రంలో వెయ్యి పైగా గురుకులాలను స్థాపించారు. బడుగు బలహీన వర్గాలకు నాణ్యమైన విద్యను అందించారు. మహిళా చైతన్య దీప్తి, సావిత్రి బాయి ఉద్యమ స్ఫూర్తి అందరికీ ఆదర్శప్రాయం అని చెప్పటం జరిగింది. ఈ కార్యక్రమంలో మొచ్చి గణేష్, ఎర్రవట్టి సాయిబాబా, శివసూరి, సంజయ్యాదవ్, గోపాల్, మౌలా తదితరులు పాల్గొన్నారు.