calender_icon.png 10 March, 2025 | 7:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవాబుపేట అంగన్వాడీలో సావిత్రిబాయి పూలే వర్ధంతి

10-03-2025 04:14:40 PM

చిట్యాల (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట అంగన్వాడి కేంద్రంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి సూపర్వైజర్ జయప్రద పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.17 విద్యాసంస్థలను నెలకొల్పి ఆడవారందరికీ చదువుల తల్లి అయి సామాజిక సేవలు చేస్తూ ఆదర్శమూర్తిగా నిలిచిందని కొనియాడారు. ఈ రోజుల్లో ఆడవాళ్లందరూ అన్ని రంగాలలో రాణిస్తున్నారని, అందుకు సావిత్రిబాయి పూలే మనందరికీ ఆదర్శం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ రాజేశ్వరి, వెంకటరమణ, శారద, స్కూల్ టీచర్స్ కిరణ్, ఆదర్శ పాల్గొన్నారు.