పెబ్బేరు, జనవరి 3: పెబ్బేరు మున్సి పాలిటీ అంబేద్కర్ కాలనిలోని ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం సావిత్రిబాయి పూ లే జయంతి వేడుకలు ఘనంగా నిర్వ హించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నా రు. ఈ సందర్బంగా పాఠశాలలోని మహిళా ఉపాధ్యాయులను శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు.
సావిత్రిబాయి పూ లే ఆశయాలను కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి జయరాములు, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ప్రమోదిన, వైస్ చైర్మన్ విజయవర్ధన్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాసులు గౌడు, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేశ్ సాగర్, మాజీ సర్పం సురేందర్ గౌడ్, మార్కెట్ డైరెక్టర్లు రామన్ గౌడు, మోతే రాములు, కాంగ్రెస్ నాయకులు రంజిత్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.