నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీకృత భవనంలో శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ విద్యాశాఖ అధికారి రామారావు ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. తొలి మహిళా ఉపాధ్యాయులుగా ఆమె విద్యాభివృద్ధికి చేసిన కృషిని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పరీక్షల సహాయ కమిషనర్ పద్మ, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.