calender_icon.png 10 January, 2025 | 1:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫాంహౌస్‌లో పడుకున్న వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఎందుకు..?

03-01-2025 04:43:54 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): రవీంద్ర భారతి(Ravindra Bharati)లో బీసీ మహిళ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సావిత్రిబాయి పూలే 194వ రాష్ట్ర స్థాయి జయంతి ఉత్సవాలకు(Savitribai Phule Jayanti Celebrations) టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్(TPCC President and MLC Mahesh Kumar Goud) ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. దేశంలో మొదటి మహిళా పాఠశాల స్థాపించి దళిత, అణగారిన వర్గాలకు విద్యానందించిన మహిళల విద్యా ప్రదాత సావిత్రి బాయి పూలే అని గుర్తు చేశారు. మహిళలు చదువుకునేందుకు తొలి అడుగు పూలే వేశారని చెప్పారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కి కట్టుబడి ఉన్నామని, వీర వనిత సావిత్రి బాయి పూలే విద్య ఆత్మవిశ్వాసం ఇస్తుందని, ఆమె మాటలను మహిళలు ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని సూచించారు. సావిత్రి బాయి పూలే పేరిట యూనివర్శిటీ ఏర్పాటు కోసం కృషి చేస్తా అని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

 సావిత్రి బాయి అణగారిన వర్గాల విముక్తికి తన జీవితం అంకితం  చేసిన గొప్ప మహనీయురాలు అని వ్యాఖ్యానించారు. కట్టుబాట్లకు లోబడి మహిళలు బయటికి రాలేని రోజుల్లో మహిళా సాధికారత కోసం ఆమె పోరాడారు. ఏదైనా యూనివర్సిటీకి జ్యోతిరావు పూలే, సావిత్రి బాయి పూలే పేర్లను పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున కృషీ చేస్తామని చెప్పారు. బీసీల గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం అనైతికం అన్నారు. విద్య, వైద్య  పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం దూర దృష్టితో ముందుకెళ్తుందని తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క కార్పొరేషన్ కైనా నిధులు కేటాయించారా?, బీసీ బిడ్డను వర్కింగ్ ప్రెసిడెంట్ చేసే సత్తా ఉందా? అని బిఆర్ఎస్, బీజేపీ పార్టీలకు సవాలు చేశారు. 

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వేపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుందన్నారు. బీసీ బిడ్డలుగా కాంగ్రెస్ లో పోరాడుతున్నామని, జ్యోతిరావు పూలే తరువాత మరొక పూలే రాహుల్ గాంధీ అని చెప్పుకోచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే కుల గణన సర్వే చేసి తీరాలని డిమాండ్ చేశారు. మోసం చేసి నిట్ట నిలువునా ముంచిన బీఆర్ఎస్ నేతలు బీసీల గురించి మాట్లాడటం హాస్యాస్పదని ఎద్దేవా చేశారు. ఫాం హౌస్ లో పడుకున్న వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఎందుకు? ప్రశ్నించారు. కులాలకు అతీతంగా ప్రశ్నించే హక్కు కాంగ్రెస్ పార్టీలో ఉందని, బిఆర్ఏస్, బీజేపీలో నాయకులకు ప్రశ్నించే స్వేచ్ఛ ఉంటుందా? అని మహేష్ కుమార్ గౌడ్ అడిగారు.