calender_icon.png 11 March, 2025 | 6:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సావిత్రి బాయి ఫూలే స్ఫూర్తినీయురాలు

11-03-2025 12:27:21 AM

ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 

ఎల్బీనగర్, మార్చి 10: సావిత్రి బాయి పూలే మహిళలకు స్ఫూర్తినీయురాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. సావిత్రి భాయి పూలే 128 వ వర్దంతి సందర్భంగా సోమవారం  మాన్సూరాబాద్ డివిజన్‌లోని సహారా వద్ద ఉన్న సావిత్రి బాయి పూలే విగ్రహానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సమాజంలో అసమానతల మీద అలుపెరుగని పోరాటం చేసి, అణగారిన వర్గాల్లో మహిళల విద్యావ్యాప్తి కోసం కృషి చేసిన గొప్ప సంస్కర్త అన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి, బీఆర్‌ఎస్ డివిజన్ మాజీ అధ్యక్షుడు జగదీశ్ యాదవ్, నాయకులు టంగుటూరి నాగరాజు, రుద్ర యాదగిరి నేత, విజయ్ భాస్కర్ రెడ్డి, సతీశ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.