calender_icon.png 11 March, 2025 | 3:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళాలోకానికి సావిత్రిబాయి ఫూలే దిక్సూచి

11-03-2025 12:10:20 AM

పటాన్‌చెరు, మార్చి 10 : విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యమని నమ్మి మహిళల్లో చైతన్యం తీసుకుని వచ్చి చదువుకునే దిశగా ప్రోత్సహించిన   సావిత్రిబాయి పూలే మహిళా లోకానికి  దిక్సూచి అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా చిట్కుల్‌లోని ఎన్‌ఏంఆర్ క్యాంప్ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల హక్కుల సాధనలో ఆమె కీలక పాత్ర పోషించారన్నారు. మహిళలు చదువుకోవాలని వారికి చేదోడు వాదోడుగా నిలుస్తూ మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేశారన్నారు.

ప్రస్తుత కాలంలో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటే ఆ మహనీయురాలు చేసిన కృషి తోనే సాధ్యమైందన్నారు. ఆ మహనీయురాలి జయంతిని రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రజాప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు.