calender_icon.png 10 March, 2025 | 3:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు

10-03-2025 12:46:02 PM

మందమర్రి,(విజయక్రాంతి): సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో సోమవారం సావిత్రిబాయి పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షులు సకినాల శంకర్ మాట్లాడారు. సమాజంలో నెలకొన్న అసమానతలను తొలగించేందుకు అలుపెరుగని పోరాటం చేసి మహిళా హక్కుల కోసం సావిత్రిబాయి ఫూలే విశేష కృషి చేశారని ఆమె సేవలను  కొనియాడారు. ఈ  కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నేరెళ్ల వెంకటేష్, పట్టణ గౌరవ అధ్యక్షులు బొలిశెట్టి రాజయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ బెర వేణుగోపాల్, ఎగ్జిక్యూటివ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గట్ల సారంగపాణి, తాజుద్దీన్, ఉపాధ్యక్షులు దేవరపల్లి ప్రభాకర్, ఏదులపురం రాజు, మానకొండ శంకర్, ప్రసాద్, సతీష్, ఐలయ్య, మూర్తిలు పాల్గొన్నారు.