10-03-2025 01:27:38 PM
ఏవైఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య
చిట్యాల,(విజయక్రాంతి): భారతదేశంలోని సమాజానికి, మహిళాలోకానికి స్ఫూర్తి ప్రధాత సావిత్రిబాయి ఫూలే అని ఏవైఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య(AYS State Organizing Secretary Pulla Mallaiah) అన్నారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని చౌరస్తాలో సావిత్రిబాయి పూలే 128 వ వర్ధంతి వేడుకను అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పుల్ల మల్లయ్య మాట్లాడుతూ భారతదేశ తొలి మహిళ ఉపాధ్యాక్షురాలిగా, సంఘ సంస్కర్తగా, మహాత్మ జ్యోతిరావు ఫూలే అర్ధాంగిగా సమాజ మార్పు కోరిన మానవతా మూర్తి సావిత్రిబాయి ఫూలే అని అన్నారు. 1948లో పూణేలోని బుధవార్‌పేటలో మహిళల కోసం మొట్టమొదటి సారిగా పాఠశాలను స్థాపించిన ఆమె విద్యాదాతగా నిలిచిందన్నారు. శిరోముండనం, సతీసహగమనం,బాల్య వివాహాల నిషేధంపై ఉద్యమించిన గొప్ప నాయకురాలని ఆమె సేవలను కొనియాడారు. మహానీయుల ఆశయాల సాధనకోసం దళిత, బహుజన వర్గాలు ఉన్నత చదువులు చదవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గుర్రపు రాజేందర్,పుల్ల ప్రతాప్, సరిగోమ్ముల రాజేందర్, పాముకుంట్ల చందర్, శీలపాక ప్రణీత్, దాసారపు సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.