calender_icon.png 10 March, 2025 | 7:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి

10-03-2025 04:45:30 PM

పాల్వంచ (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పట్టణంలోని సిఆర్ భవన్ లోని సిపిఐ కార్యాలయంలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి సోమవారం  ఘనంగా నిర్వహించారు. మహిళా సమాఖ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వీసంశెట్టి పద్మజ సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సంఘ సేవకురాలు మూఢ నమ్మకాలు అంద విశ్వాసాలు వదిలి మహిళలంతా విద్యను అభ్యసించాలని మహిళల విద్యతోనే దేశం ముకాభివృద్ధి పెరుగుతుందని తన భర్త జ్యోతిబాపూలే సహకారంతో 1850 దశకంలోనే మహిళాలోకం లోని చైతన్య దీపకలు వెలిగించిన ఆనాటి మొట్టమొదటి సరస్వతి పుత్రిక అమ్మ సావిత్రి భాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మహిళ నాయకురాలు కమటం ఈశ్వరమ్మ, వగ్గల పద్మ, లక్ష్మి ధనమ్మ, సత్యమ్మ, అనసూయమ్మ తదితరులు పాల్గొన్నారు.