* ఇక నుంచి ఏటా జనవరి 3న వేడుకలు
* నేడు రవీంద్రభారతి వేదికగా ‘ఉమెన్స్ టీచర్స్ డే’
* ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రప్రభుత్వం
హైదరాబాద్, జనవరి 2 (విజయక్రాం తి): సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జనవరి 3న మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి ఏటా ఇదే తేదీలో అధికారికంగా వేడుకలు జరుగనున్నాయి.
దీనిలో భాగంగానే శుక్రవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో రాష్ట్రప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించనున్నది. వేడుకకు మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, పలువురు ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.
మహిళల చదువు.. ఇంటికి వెలుగు: మంత్రి పొన్నం
సావిత్రిబాయి జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలనే నిర్ణ యం హర్షణీయం. ఇంత మంచి నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు. ‘మహిళల చదువు.. ప్రతి ఇంటికి వెలుగు’ అనే ఉద్దేశంతో సావిత్రిబాయి దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలు అయ్యా రు.
సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడారు. మహిళా విద్య, అంటరానితనం నిర్మూలన కోసం జీవితాన్ని పూర్తిగా అంకి తం చేశారు.
గొప్పగా ప్రభుత్వ నిర్ణయం: పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్
సావిత్రిబాయిజయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలనే రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అన్నివర్గాల ప్రజలు స్వాగతించాలి. మహిళలను అక్షరాస్యులను చేసేందుకు సావిత్రిబాయి ఎంతో శ్రమించారు.
ఆమె త్యాగం, కృషి స్ఫూర్తిదాయకం. గత ప్రభు త్వం ఇంత మంచి ఆలోచనలు చేయలేదు. కేవలం తమ కుటుంబ స్వార్థం కోసం మాత్ర మే పని చేశాయి. కానీ.. మా ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్నది.
సీఎంకు ధన్యవాదాలు
దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి. ఆమె జయంతి రోజు అధికారికంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించాలనే నిర్ణయం ఆనందాన్నిచ్చింది. ఈ సందర్భంగా నేను సీఎం రేవంత్‌రెడ్డికి కృత జ్ఞతలు తెలుపుతున్నాను.
బీసీల ఆకాంక్షలను గౌరవించి సావిత్రిబాయి జయంతి రోజు అధికారికంగా వేడుక నిర్వహించడాన్ని ప్రతిఒక్కరూ స్వాగతించాలి. శుక్ర వారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతి లో జరిగే రాష్ట్రస్థాయి ఉమెన్స్ టీచర్స్ డే ఉత్సవాలకు పార్టీలకు అతీతంగా బీసీలు తరలిరావాలి.
జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు