అంబేద్కర్ యువజన సంఘం మండలాధ్యక్షుడు రాందాస్...
లక్షేట్టిపేట (విజయక్రాంతి): బహుజనుల ఆశాజ్యోతి సావిత్రి బాయి ఫూలే అని అంబేద్కర్ యువజన సంఘం మండలాధ్యక్షుడు ముల్కల రాందాస్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో సావిత్రి భాయి ఫూలే 194వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలకు మొదట విద్యను అందించిన ఘనత ఆమెకే దక్కుతుందన్నారు. బాలిక విద్య, వితంతు విద్యతో పాటు సత్య శోధక్ సమాజ్ స్థాపనలో ఆమె పాత్ర మరువలేనిదన్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం సావిత్రి బాయి ఫూలే జయంతిని మహిళ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం సంతోషకరమన్నారు. నేడు ప్రభుత్వం అనేక బీసీ గురుకులాలను ఫూలే దంపతుల స్ఫూర్తితోనే ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు.
అనంతరం జిల్లా నాయకులు శనిగారపు లింగన్న మాట్లాడుతూ.. సావిత్రి బాయి ఆశయాలను అందరూ ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం మాజీ మండలాధ్యక్షుడు దొంత నర్సయ్య, ప్రధాన కార్యదర్శి అకెనపల్లి శిల్పతి, నాయకులు బిరుదుల ధర్మన్న, లింగంపెల్లి వెంకటేష్, అడ్లూరి దేవేందర్, రాపెల్లి భగవాన్ దాస్, గోల్కొండ సత్తయ్య, మాజీ పట్టణ అధ్యక్షులు బోనగిరి కుమార్, మేకల బానేష్, చిప్పకుర్తి శ్రీనివాస్, మేకల దిలీప్, నాయి బ్రాహ్మణ సంఘం, రజక సంఘం నాయకులు చెరుకు వేణుగోపాల్, నేరెళ్ల లక్ష్మీ రాజం తదితరులు పాల్గొన్నారు.