calender_icon.png 10 March, 2025 | 11:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సావిత్రి బాయి పూలే మహిళలకు ఆదర్శం

10-03-2025 08:27:27 PM

మాజీ కార్పొరేటర్ లక్ష్మీప్రసన్న రామ్మోహన్ గౌడ్..

ఎల్బీనగర్: సావిత్రి బాయి పూలే మహిళలకు ఆదర్శమని మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీప్రసన్న రామ్మోహన్ గౌడ్ అన్నారు. విద్యా జ్యోతి, భారత దేశ ప్రప్రథమ మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతిని సందర్భంగా మన్సూరాబాద్ సహారా వద్ద సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, బీఎన్ రెడ్డి నగర్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీప్రసన్న రామ్మోహన్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై, సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పూలే యువజన సంఘం సభ్యులు మేడిగ శ్రీధర్, శనిగరపు స్వామి, చామకూర రాజు, కేవీ గౌడ్, బొంగు వెంకటేశ్ గౌడ్, నకరికంటి శ్రీనివాస్, నేరడ సైదులు, సోమేశ్ కుమార్, నరేశ్ చారి తదితరులు పాల్గొన్నారు.