18న ఎన్‌పీఎస్ వాత్సల్యను ప్రారంభించనున్న సీతారామన్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తు కోసం నిర్దేశించిన పొదుపు పథకం ‘ఎన్‌పీఎస్ వాత్యల్య’ను సెప్టెంబర్ 18న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించనున్నారు. 2024 కేంద్ర బడ్జెట్లో ఈ స్కీమ్‌ను ప్రకటించారు. ఎన్‌పీఎస్ వాత్సల్యలో పెట్టుబడి చేసేందుకు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను కూడా అదే రోజున ఆర్థిక మంత్రి ప్రారంభిస్తారని, స్కీమ్ బ్రోచర్‌ను విడుదల చేస్తారని, మైనర్ చందాదారులకు పర్మినెంట్ రిటైర్‌మెంట్ అకౌంట్ నంబర్ (ప్రాన్) కార్డులను పంపిణీ చేస్తారని మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో వివరించింది.
స్కీము ప్రారంభోత్సవంలో భా గంగా దేశవ్యాప్తంగా 75 ప్రాం తాల్లో ఎన్‌పీఎస్ వాత్సల్య ఈవెంట్స్‌ను నిర్వహించనున్నట్టు ప్రకటనలో వెల్లడిం చింది. వీడియో కాన్ఫెరెన్సింగ్ ద్వారా ఆయా ప్రాంతాలు ప్రారంభ కార్యక్రమంలో చేరతాయని, అదే ప్రాంతంలో కొత్త మైనర్ ఎన్‌పీఎస్ చందాదారులకు ప్రాన్ సభ్యత్వ కార్డును పంపిణీ చేస్తారని పేర్కొంది.
స్కీమ్ వివరాలు..
తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్ కోసం వారి తరపున ఒక పెన్షన్ ఖాతాను తెరిచి ఎన్‌పీఎస్ వాత్సల్య స్కీమ్‌లో పెట్టుబడి చేయవచ్చు. అన్ని వర్గాలకు అనువుగా ఒక చైల్డ్ పేరుతో సంవత్సరానికి కనీసం రూ.1,000 మదుపు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. చిన్న వయస్సులోనే ఆర్థిక భవిష్యత్తుకు భరోసా కల్పించేలా ఈ స్కీమ్‌ను డిజైన్ చేశారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ స్కీమ్‌ను నిర్వహిస్తారు.