19-03-2025 12:22:50 AM
* ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్‌కు శివగంగా కాలనీ వాసుల ఫిర్యాదు
ఎల్బీనగర్, మార్చి 18 : కాలనీ పార్క్ స్థలం కబ్జా చేసి నిర్మాణం చేపట్టిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఎల్బీనగర్ జోనల్ కమీషనర్ హేమంత్ కేశవ్ పాటిల్‌కు హయత్ నగర్ లోని శివలింగంగా కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు.
పక్క లే అవుట్‌లో 211 గజాల ప్లాట్ ఓనర్ తమ కాలనీ లే అవుట్‌లోని 153గజాల పార్క్ స్థలం కబ్జా చేసి నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. తమ కాలనీ పార్క్ స్థలాన్ని కాపాడాలని కోరడంతో దానిపై ఎల్బీనగర్ జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ విచారణ ప్రారంభించారు.