calender_icon.png 13 March, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా కొడుకును కాపాడండి

12-03-2025 12:00:00 AM

  • కిడ్నీలు ఫెయిల్ అయి తీవ్ర అస్వస్థత 

దాతలు ఆదుకోవాలని తల్లిదండ్రుల వేడుకోలు

పిట్లం, మార్చి 11 : అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న బాలుని కుటుంబం చికిత్స కోసం ఆర్థికంగా ఇబ్బందులతో పోరాటం చేస్తున్న  పేద కుటుంబం ఇది. అసలే నిరుపేద కుటుంబం కా వడంతో పాటు కిడ్నీలు ఫెయిల్ అయి  మరో పెద్ద దెబ్బ పడింది. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రానికి చెందిన మిర్యాల చిరంజీవి కుమారుడు అరవింద్ (వయసు 12) రెండు కిడ్నీలు దెబ్బతినడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

చిన్న వయసులోనే ఇలాంటి అనారోగ్యం బారిన పడిన ఆ కుటుంబం ఇప్పటివరకు చికిత్స కోసం రూ. 2.50 లక్షలు ఖర్చు చేసినట్లు పేర్కొంది. మూలధన సాధనకు ఆ కుటుంబం తీవ్రంగా బాధపడుతుండగా, దాతల ఆదరణ కోసం బాలుడి తండ్రి విజ్ఞప్తి చేస్తున్నారు.

సహాయం చేయాలనుకున్న వారు ఈ ఎస్బిఐ పిట్లం బ్రాం అకౌంట్ నెంబరు : 331714 22354 ఐఎఫ్‌ఎస్సి కోడ్ ఎస్ బి ఐ ఎన్ 0012969 పై చెల్లించ గలరని వేడుకుంటున్నారు. మరిన్ని వివరాల కొరకు ఈ నెంబర్ పై 9550657480 సంప్రదించగలరు.